తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో భక్తులు సమర్పించే చీరలకు విశేష ఆదరణ లభిస్తోంది. అమ్మవారికి అర్పించిన చీరలను ఆలయ ఆవరణంలోనే అందుబాటు ధరలకు విక్రయిస్తుండటంతో భక్తులు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. సాధారణ నేత చీరల నుంచి ఖరీదైన పట్టు చీరల వరకు భక్తులు తమ స్తోమతకు అనుగుణంగా సమర్పిస్తున్నారు. జాతర సమయాల్లోనే కాకుండా ప్రత్యేక పర్వదినాలు, వారాల్లో కూడా పెద్ద సంఖ్యలో చీరలు సమర్పిస్తున్నారు. ఆలయంలో భద్రపరిచిన ఈ చీరలను రూ. 100 నుంచి రూ. 10వేల వరకు విక్రయిస్తుండగా, భక్తులు వాటిని అమ్మవారి ప్రసాదంగా భావించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈ చీరలకు నిరంతరం డిమాండ్ కొనసాగుతోంది.