తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

4చూసినవారు
తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని శ్రీసిటీలో ఈ-ప్యాక్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ కమ్మేసింది. కార్మికులు భయాందోళనతో పరుగులు తీశారు. ముడిసరుకు, యంత్రాలు కాలి బూడిదవుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మూడుకు పైగా ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గాలి కారణంగా మంటలను అదుపు చేయడం సవాలుగా మారింది. ప్రాణనష్టం తప్పినట్లు తెలుస్తోంది, అయితే ఆస్తి నష్టం భారీగా ఉండొచ్చని అంచనా.

సంబంధిత పోస్ట్