చిత్తూరు జిల్లాలో గాయపడిన ఒంటరి ఏనుగును అటవీశాఖ అధికారులు మంగళవారం తిరుపతిలోని ఎస్వీ జూపార్కుకు తరలించారు. కమ్మపల్లి అటవీ బీట్ పరిధిలో తిరుగుతున్న ఏనుగు నేలపై కుప్పకూలి ముందుకాలికి గాయపడింది. సమాచారం అందిన వెంటనే అటవీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, కుంకీ ఏనుగుల సహాయంతో, భారీ క్రేన్ ద్వారా ఏనుగును సురక్షితంగా వాహనంలో ఎక్కించి జూపార్కుకు తరలించారు.