తిరుమల ఘాట్ రోడ్డులో పనుల పరిశీలన.. వేగవంతం చేయాలని ఆదేశం

24చూసినవారు
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని బాటగంగమ్మ ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. అలిపిరి నడకమార్గంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి మోకాళ్ల పర్వతం వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీవీఎస్ఓ మురళీకృష్ణ, ఎస్పీ సుబ్బరాయుడు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్