టీటీడీ పాలకమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. తనపై వచ్చిన అభియోగాల నేపథ్యంలో గతంలో రాజీనామా సమర్పించిన ఆయన, బోర్డు నిరాకరించడంతో తిరిగి స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు రెండు నెలల విరామం తర్వాత ఆయన తిరుమల రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వచనం అందించగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.