తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీలో చిరుత కలకలం, అటవీశాఖ రంగంలోకి

3చూసినవారు
తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీలో చిరుత కలకలం, అటవీశాఖ రంగంలోకి
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో చిరుతపులి కలకలం రేపింది. నిన్న ఉదయం 8:57 గంటలకు క్లినికల్ సైన్సెస్ విభాగంలో చిరుత కనిపించడంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అటెండర్ తలుపు తెరవగానే చిరుత కనిపించడంతో ఆమె భయంతో పరుగులు తీసి, ఉన్నతాధికారులకు సమాచారం అందించింది. భవనం వెనుక చెట్టు ఎక్కి చిరుత చొరబడి ఉంటుందని భావించిన సిబ్బంది, కర్రలతో బెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో భయపడిన చిరుత టాయిలెట్ లోకి వెళ్లి దాక్కుంది. ఏడాది వయసున్న ఆడ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ హనుమాన్ టీమ్ రంగంలోకి దిగింది.

సంబంధిత పోస్ట్