మంగళవారం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని టీడీపీ పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి, సినీ నటుడు సాయిధరమ్ తేజ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. శ్రీవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు ప్రముఖులు తెలిపారు.