తిరుపతిలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వార్తలను నమ్మవద్దని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బంకుల వద్ద అనవసర రద్దీ చేయకుండా అవసరమైన మేరకే ఇంధనం తీసుకోవాలని సూచించారు. పోలీసుల సహకారంతో 24 గంటల పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు. సోమవారం సాయంత్రానికి అన్ని పెట్రోల్ బంకులకు ట్యాంకర్లు చేరుకుంటాయని, అనంతరం ఇంధనం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.