కర్నూలు ప్రమాదంలో అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతిలో ప్రైవేట్ ట్రావెల్స్‌పై ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టికెట్ బుక్ చేసిన వారికి సమయానికి సమాచారం ఇవ్వకుండా రద్దు చేస్తున్నారంటూ ఆరోపించారు. యాజమాన్యానికి కాల్ చేసినా స్పందన లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు తనిఖీలను కొనసాగిస్తున్నారు.