తిరుమల లడ్డూ విక్రయాల్లో రికార్డ్..!

3చూసినవారు
తిరుమల లడ్డూ విక్రయాల్లో రికార్డ్..!
ఈ ఏడాది తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయాలు రికార్డు స్థాయికి చేరాయి. 2024లో 12.15 కోట్ల లడ్డూలు, 2025లో 13.52 కోట్ల లడ్డూలు భక్తులకు అందించారు. డిసెంబర్ 27న ఒక్కరోజే 5.13 లక్షల లడ్డూలు అమ్ముడుపోయాయి. గత దశాబ్ద కాలంలో ఇదే అత్యధికం. లడ్డూ నాణ్యత, రుచి మెరుగుపడటంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని టీటీడీ తెలిపింది.

సంబంధిత పోస్ట్