తిరుపతిలో రూ. 5. 32 కోట్ల గంజాయి దగ్ధం

4చూసినవారు
తిరుపతి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు నిఘా పెంచారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో స్వాధీనం చేసుకున్న రూ. 5.32 కోట్ల విలువైన 1,064 కిలోల గంజాయిని అనంతపురం రేంజ్ ఐజీ డా. షిముషి బాజ్పేయ్ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నియంత్రణపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఐజీ స్పష్టం చేశారు. పదేపదే నేరాలకు పాల్పడుతున్న 16 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్