
సంక్రాంతి ఎఫెక్ట్.. ప్రైవేట్ ట్రావెల్స్ భారీ దోపిడీ
సంక్రాంతిని అడ్డు పెట్టుకుని ప్రైవేట్ ట్రావెల్స్ భారీ దోపిడీకి పాల్పడుతున్నాయి. ఆన్ లైన్ లో టికెట్లు లేవంటూ కృత్రిమ కొరత సృష్టించి రెట్టింపు ధరలకు టికెట్లు విక్రయిస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. HYD నుంచి ఎటు వెళ్లాలన్నా రూ.2 వేలకు పైమాటే. ప్రయాణికులను దోచుకుంటూ.. 'డిమాండ్‌ను బట్టి రేట్లు పెంచుతాం ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి' అంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారని మండిపడుతున్నారు.




