సత్యవేడు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం విద్యుత్ శాఖ అధికారులను కోరారు. మంగళవారం తిరుపతిలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో తిరుపతి సర్కిల్ ఎస్ఈ కే. కరుణాకర్ (ఎస్. ఈ, ఆపరేషన్, ఏపీఎస్పీడీసీఏఎల్) మరియు వి. చంద్రశేఖర్ (ఎస్. ఈ, మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్, ఏపీ ట్రాన్స్ కో) లను కలిసి ఎమ్మెల్యే ఆదిమూలం ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.