నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని గూడూరు, కోవూరు ప్రాంతాల్లో జల్లులు కురుస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది. ఈ మధ్యాహ్నం ఉత్తర శ్రీలంకలోని ట్రింకోమలీ-జాఫ్నా మధ్య తీవ్రవాయుగుండం తీరాన్ని దాటే అవకాశం ఉందని IMD వెల్లడించింది. అయితే, తుఫానుగా మారే అవకాశం లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు ముప్పు తప్పిందని వాతావరణ నిపుణులు తెలిపారు.