తిరుమలలో వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు

2చూసినవారు
తిరుమలలో వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు
తిరుమల శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవంలో భాగంగా, గురువారం తిరుమలలోని ఆస్థాన మండపంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు స్వామివారి వైభవం, మెట్లోత్సవం విశిష్టతను వివరించారు. నామ సంకీర్తన, సామూహిక భజన, హరిదాసుల ఉపదేశాలు, సంగీత విభావరి వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్