తిరుపతి గరుడ వారధిపై ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపడుతున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. ప్రతి మలుపు వద్ద బ్లీకింగ్ లైట్లు, రేడియం ఏరో మార్క్స్, సేఫ్టీ మెజర్‌మెంట్స్ ఏర్పాటు చేస్తున్నారు. శనివారం ఎస్పీ స్వయంగా వారధిని సందర్శించి, ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించారు. ప్రమాదాల నివారణకు అధికారులకు, సిబ్బందికి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రవిమనోహర్ ఆచారి, డీఎస్పీలు భక్తవత్సలం, రామకృష్ణ చారి, సీఐ సంజీవి, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.