తిరుమలలో సడెన్ గా పెరిగిన భక్తుల రద్దీ

70చూసినవారు
తిరుమలలో సడెన్ గా పెరిగిన భక్తుల రద్దీ
వారాంతపు సెలవుల నేపథ్యంలో తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ అధికమైంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, నారాయణగిరి షెడ్లు నిండిపోయి, రింగురోడ్డు దాకా సర్వదర్శన భక్తులు రెండు కిలోమీటర్ల మేర క్యూలో నిలబడ్డారు. శనివారం 92,221 మంది శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనానికి ప్రస్తుతం 16 గంటలు పట్టుతోంది. టోకెన్లు దొరకక తిరుపతిలో భక్తులు తీవ్రంగా ఆవేదన చెందారు.

సంబంధిత పోస్ట్