
తిరుపతిలో హోటల్‌కు బాంబు బెదిరింపు (వీడియో)
AP: తిరుపతిలోని రాజ్ పార్క్ హోటల్‌కు ఇంటర్నెట్ కాల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. అజ్ఞాత వ్యక్తి చేసిన ఈ కాల్‌తో హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో కలిసి హోటల్లో గంటల తరబడి తనిఖీలు నిర్వహించారు. పేలుడు పదార్థాలు ఏవీ లభించకపోవడంతో, ఇది ఫేక్ కాల్‌గా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




