తవణంపల్లె: చెరువులో మునిగి ఒకరి మృతి

5చూసినవారు
తవణంపల్లె: చెరువులో మునిగి ఒకరి మృతి
తవణంపల్లె మండలం కామాలూరులో విషాదం నెలకొంది. పులిచెర్ల మండలానికి చెందిన వీరబల్లి భాస్కర్(35) రెండేళ్లుగా లలితతో కలిసి కామలూరులో నివసిస్తూ కూలీ పనులు చేస్తున్నాడు. ఈక్రమంలో చెరువు దగ్గర మంగళవారం సాయంత్రం భార్యాభర్త గొడవపడ్డారు. ఆ తర్వాత ఇద్దరూ చెరువులో పడిపోయారు. స్థానికులు గమనించి లలితను కాపాడారు. భాస్కర్ నీట మునిగిపోయాడు. మంగళవారం అతని మృతదేహం వెలికితీశారు. ఎస్ఐ రమేశ్ బాబు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్