రేణిగుంటలో ఇంధన కొరత లేదు: తహసీల్దార్

1039చూసినవారు
రేణిగుంటలో ఇంధన కొరత లేదు: తహసీల్దార్
రేణిగుంట మండలంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే ప్రచారంలో వాస్తవం లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని తహసీల్దార్ శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు మండలంలోని 12 పెట్రోల్ బంకుల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిల్వలను పరిశీలించారు. అన్ని బంకుల్లోనూ తగినంత ఇంధనం అందుబాటులో ఉందని, కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనవసరంగా బంకుల వద్ద క్యూ కట్టి కంగారు పడాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్