తిరుమల శ్రీవారికి మూడు బ్యాటరీ వాహనాలు విరాళం

16చూసినవారు
తిరుమల శ్రీవారికి మూడు బ్యాటరీ వాహనాలు విరాళం
సత్యసాయి జిల్లా ధర్మవరంకు చెందిన వేణు మోటార్స్ యజమాని డి. వేణుగోపాల్, భగవంతుని సేవార్థం రూ. 1.53 లక్షల విలువైన మూడు బ్యాటరీ వాహనాలను టీటీడీకి విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయం ఏఈఓ మోహన్ రాజు సమక్షంలో ట్రాన్స్ పోర్ట్ విభాగం ఆఫీస్ ఇన్‌చార్జ్ హరిబాబు ఈ వాహనాలను స్వీకరించారు. భక్తి భావంతో స్వామి సేవలో పాల్గొన్న వేణుగోపాల్‌ను అధికారులు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్