తిరుమల: టీటీడీకి ఎలక్ట్రిక్ బస్సు విరాళం

0చూసినవారు
తిరుమల: టీటీడీకి ఎలక్ట్రిక్ బస్సు విరాళం
ఢిల్లీలోని నయాతి హెల్త్ కేర్& రీసెర్చ్ ఆగ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, శనివారం ఉదయం టీటీడీకి రూ. 1.13 కోట్ల విలువైన ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందించింది. సంస్థ అధినేత నీరా రాడియా శ్రీవారి ఆలయం వద్ద బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, బస్సు పత్రాలు, తాళాలను టీటీడీ చైర్మన్ బీ. ఆర్. నాయుడు, అదనపు ఈవో సి. హెచ్. వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్, అదనపు ఈవో దాతతో కలిసి బస్సులో ప్రయాణించి, ప్రయాణికులకు ఈ బస్సు సౌకర్యవంతంగా ఉందని ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్