శ్రీవారిమెట్టు మార్గంలో ఏనుగుల గుంపు సంచరిస్తుండటంతో భక్తులు జాగ్రత్తలు పాటించాలని తిరుపతి సబ్ డీఎఫ్వో నాగభూషణం సూచించారు. మంగళవారం రాత్రి సత్యసాయి ఎస్టీ కాలనీ సమీపానికి 10 ఏనుగులు వచ్చాయని తెలిపారు. బుధవారం ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ఈ మార్గం తాత్కాలికంగా మూసివేశారు. భక్తులు ఉదయం 6 నుండి సాయంత్రం 6 మధ్యనే ప్రయాణించాలని సూచించారు.