తిరుమలలో పొగమంచు, చిరుజల్లులతో చలి తీవ్రం

15చూసినవారు
సోమవారం ఉదయం నుంచి తిరుమల గిరిపై దట్టమైన పొగమంచు, చిరుజల్లులతో చలి తీవ్రమైంది. వాతావరణ ప్రభావంతో భక్తులు అదనపు జాగ్రత్తలతో దర్శనానికి వస్తున్నారు. ప్రస్తుతం సర్వదర్శనానికి 8–10 గంటల సమయం పడుతోంది. 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం 70,345 మంది దర్శించుకోగా, 24,292 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 3.43 కోట్లుగా నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్