తిరుపతి: తోమాలసేవలో 1, 200 మంది భక్తులకు శ్రీవారి దర్శనం

5చూసినవారు
శుక్రవారం అభిషేక సేవ అనంతరం టీటీడీ అధికారులు తోమాల సేవలో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. ఈ సేవలో సుమారు 1,200 మంది భక్తులు పాల్గొన్నారు. వారాంతం కావడంతో తిరుమలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా శిలాతోరణం, బాట గంగమ్మ ఆలయం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్