అన్నమయ్య జిల్లా సానిపాయ అటవీప్రాంతంలో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 22 ఎర్రచందనం దుంగలు, మూడు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. దుంగలతో పాటు వారిని తిరుపతి టాస్క్ ఫోర్స్ స్టేషన్‌కు తరలించి, డీఎస్పీ శ్రీనివాస రెడ్డి విచారణ జరిపారు. కేసు నమోదు చేసిన సీఐ సురేశ్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు.