తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 5వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్నాభిషేకం వైభవంగా జరిగింది. ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి, అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన చేపట్టారు. సాయంత్రం భక్తులకు అన్నలింగ దర్శనం కల్పించారు. అనంతరం ఏకాంతంగా అన్నలింగ ఉద్వాసన, శుద్ధి అనంతరం రాత్రి సుగంధద్రవ్య అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నాగరత్న, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.