తిరుపతి: పారిశ్రామిక ప్రగతికి ఏపీఎస్పీడీసీఎల్ చేయూత

0చూసినవారు
తిరుపతి: పారిశ్రామిక ప్రగతికి ఏపీఎస్పీడీసీఎల్ చేయూత
పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఏపీఎస్పీడీసీఎల్ చేపట్టిన ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. బుధవారం ఏపీఎస్పీడీసీఎల్ సీఎండి శివశంకర్ లోతేటి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సంస్థ పరిధిలోని 9 జిల్లాల నుంచి 16 మంది పారిశ్రామిక వినియోగదారులు పాల్గొన్నారు. విద్యుత్ బిల్లుల సవరణ, నిర్వహణ పనుల సమాచారం, విద్యుత్ లోడ్ తగ్గింపు వంటి సమస్యలను వినియోగదారులు ప్రస్తావించగా, అధికారులు వెంటనే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్