అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పోలీస్ అధికారులు, శక్తి టీమ్ సభ్యులు విద్యార్థినులకు స్వీయ రక్షణపై సూచనలు ఇచ్చారు. టీనేజ్‌లో ఎదురయ్యే సమస్యలు, బాల్య వివాహం నేరమని, మహిళలపై జరిగే నేరాలు, వివాహ మోసాలు, డిజిటల్ మోసాలపై వివరంగా అవగాహన కల్పించారు. అపరిచితులపై అప్రమత్తంగా ఉండాలని, సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.