కూటమి ప్రభుత్వ పాలనలో 21 మంది వైసీపీ కార్యకర్తలతో పాటు మొత్తం 700 మంది హత్యకు గురయ్యారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు విద్యార్థి దశ నుంచే హింసా, కుల రాజకీయాలకు తెరతీశారని ఆయన ఆరోపించారు. ఎల్లో మీడియా ఆయనకు మద్దతుగా వ్యవహరిస్తోందని భూమన పేర్కొన్నారు. రాజారెడ్డి హత్య కేసు నిందితులకు ఆశ్రయం ఇచ్చినా, వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు పాత్ర ఉన్నా అవి ప్రజల్లోకి రాలేదని భూమన అన్నారు.