తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఛండీ హోమం ఘనంగా ప్రారంభమైంది. అక్టోబరు 30 నుండి నవంబరు 07వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం (చండీయాగం) వైభవంగా జరుగనుంది. ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.