తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని బైరాగి పట్టేడలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న అదనపు అంతస్తులను, ఎన్. జి. వో. కాలనీలో శిథిలావస్థలో ఉన్న భవనాన్ని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సిబ్బంది గురువారం తొలగించారు. బైరాగిపట్టేడలో అక్రమ నిర్మాణాలపై సమాచారం అందడంతో కమిషనర్ ఎన్. మౌర్య ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించామని, అనుమతులు లేని నిర్మాణాలను తొలగించామని డిసిపి ఖాన్ తెలిపారు.