తిరుపతి: ఫిజిక్స్ వాలా-విజయం కళాశాలపై విచారణకు డిమాండ్

7చూసినవారు
తిరుపతి: ఫిజిక్స్ వాలా-విజయం కళాశాలపై విచారణకు డిమాండ్
తిరుపతిలోని ఫిజిక్స్ వాలా-విజయం జూనియర్ కళాశాల అడ్మిషన్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని గిరిజన జన సమాజ్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం. మహేంద్ర నాయక్ డిమాండ్ చేశారు. బుధవారం ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారికి వినతిపత్రం అందజేశారు. కళాశాలకు అవసరమైన అనుమతులపై స్పష్టత లేదని, అనుమతులు రాకముందే విద్యార్థులను చేర్చుకోవడం నిబంధనలకు విరుద్ధమని ఆయన అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కళాశాల అనుమతులు, అడ్మిషన్ ప్రక్రియపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్