తిరుపతి: తిరుమల శ్రీవారి సేవలో సినీ దర్శకుడు బుచ్చిబాబు

9చూసినవారు
ప్రముఖ సినీ దర్శకుడు బుచ్చిబాబు బుధవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం విడుదల కానున్న తన తాజా చిత్రం “పెద్ది” విజయవంతం కావాలని శ్రీవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. గతంలో “ఉప్పెన” సినిమా విడుదలకు ముందు కూడా తిరుమల వచ్చి స్వామివారిని దర్శించుకున్నానని, అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు “పెద్ది” సినిమా విడుదలకు ముందు కూడా శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నట్లు చెప్పారు.

ట్యాగ్స్ :