తిరుపతి గోవిందరాజుల ఆలయం సన్నిధి వీధిలో అగ్ని ప్రమాదం నేపథ్యంలో తిరుపతి మేయర్ డా. శిరీష, కమిషనర్ మౌర్యతో కలిసి విపత్తు నివారణ, అగ్నిమాపకశాఖ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. మేయర్ మాట్లాడుతూ తిరుపతి ఓ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కావడంతో భక్తులు అధికంగా ఉండే నగరంలో అగ్ని ప్రమాదాల నివారణకు అప్రమత్తతే ప్రధానమన్నారు. ప్రతి షాపు నిర్వాహకుడు అగ్ని నివారణ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.