తిరుపతిలో మే నెలలో జరగనున్న తాతయ్యగుంట గంగమ్మ జాతర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్, ఎస్పీ, ఆలయ చైర్మన్‌లు, అధికారులు పాల్గొన్నారు. భక్తులకు తాగునీరు, పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత కట్టుదిట్టంగా ఉండాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని సూచించారు.