తిరుపతి: ధ్వజావరోహణంతో ముగిసిన గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు

0చూసినవారు
తిరుపతి: ధ్వజావరోహణంతో ముగిసిన గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించి, సకల దేవతలను ఘనంగా సాగనంపారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని సేవించిన భక్తులు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సకల శుభఫలాలను పొందుతారని ఆగమ, పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది.

ట్యాగ్స్ :