తిరుపతి: విశేష అలంకరణలో తాతయ్యగుంట గంగమ్మ.. భక్తుల రద్దీ

3చూసినవారు
తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారు మంగళవారం విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. జాతర అనంతరం వచ్చే మూడో మంగళవారం సందర్భంగా అమ్మవారికి పంచామృతాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వజ్రకిరీటం, స్వర్ణ ముఖకవచంతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని చెరుకులతో సుందరంగా తీర్చిదిద్దడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. విశేష అలంకరణలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటూ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :