తిరుపతి: అలిపిరి వద్ద జింకపై చిరుత దాడి

2చూసినవారు
తిరుపతి: అలిపిరి వద్ద జింకపై చిరుత దాడి
తిరుపతి అలిపిరిలో జింకపై చిరుత దాడి చేసి చంపిన ఘటన కలకలం సృష్టించింది. బుధవారం వేకువజామున 3.30 గంటల సమయంలో అలిపిరి ద్విచక్ర వాహనాల పార్కింగ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జింకను వేటాడిన చిరుత అడవిలోకి వెళ్లిపోయిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు, భక్తులు అలిపిరి పరిసరాల్లో అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ నిఘా పెంచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్