తిరుపతి నగరంలో బిక్షాటన నిర్మూలనకు ముత్యాలరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య అన్నారు. శనివారం ఆయన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడి వసతులు, అక్కడ ఉన్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బిక్షగాళ్లకు వసతి, శిక్షణ కల్పించి, తిరిగి బిక్షాటన చేయకుండా స్వయం నిలుపునకు దోహదపడతామని చెప్పారు.