తిరుపతి: గ్రేటర్ తిరుపతిపై మంత్రి కీలక ప్రకటన

18చూసినవారు
మంత్రి అనగాని సత్యప్రసాద్‌ గ్రేటర్‌ తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు అందరూ సహకరించాలని కోరారు. మంగళవారం తిరుపతి కలెక్టరేట్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తిరుపతి జిల్లా అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, ప్రస్తుతం 30.174 చ.కి.మీ. పరిధిలో ఉన్న తిరుపతి కార్పొరేషన్‌ను 270.23 చ.కి.మీ.కు విస్తరించే ప్రణాళిక సిద్ధమైందని వెల్లడించారు. తిరుపతిని కేంద్రంగా చేసుకుని రాయలసీమ జోన్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్