నూతన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్యే తనయులు ఆరణి మదన్, జగన్ లు హైదరాబాద్ లో శుక్రవారం కలిసి అభినందనలు తెలిపారు. బిఆర్ నాయుడు నేతృత్వంలో తిరుమల ప్రతిష్ట మరింత మెరుగు పడుతుందని ఆయన ఆకాంక్షించారు. తిరుపతి అభివృద్ధికి టీటీడీ తన వంతు చేయూత అందించేలా చూడాలని బీఆర్ నాయుడును తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు.