తిరుపతి: ఒకరికి రూ.100కే పెట్రోల్..!

8చూసినవారు
తిరుపతి జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామచంద్రపురం మండలంలో నాలుగు పెట్రోల్ బంకులు ఉన్నప్పటికీ, ఒకే బంకులో మాత్రమే ఇంధనం అందుబాటులో ఉంది. దీంతో బైకులకు రూ.100, కార్లకు రూ.500 చొప్పున పరిమితంగానే ఇంధనం అందిస్తున్నారు. రామచంద్రపురంలో ఇంధనం లభ్యత గురించి తెలియడంతో తిరుపతి నుంచి కూడా వాహనాలు ఇక్కడికి భారీగా తరలివస్తున్నాయి.

సంబంధిత పోస్ట్