తిరుపతి: పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర ‘పుష్ప’.!

9చూసినవారు
తిరుపతి: పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర ‘పుష్ప’.!
తిరుపతి SP సుబ్బారాయుడు తెలిపిన వివరాల ప్రకారం, అంతర్రాష్ట్ర స్మగ్లర్ నాజర్‌తో పాటు అతని ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.2 కోట్ల విలువైన 76 నాణ్యమైన ఎర్రచందనం దుంగలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరించిన ఈ ముఠా నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడిపై ఇప్పటికే 10 కేసులు ఉన్నాయని, అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్లు SP వెల్లడించారు.