తిరుపతి: ఇద్దరు చిన్నారులను కాపాడిన పోలీసులు

79చూసినవారు
తిరుపతి: ఇద్దరు చిన్నారులను కాపాడిన పోలీసులు
తిరుమల వరాహస్వామి పార్కింగ్ లో గురువారం సాయంత్రం ట్రాఫిక్ పోలీసుల సమయస్ఫూర్తితో ఇద్దరు చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. పార్కింగ్ లో నిలిపి ఉంచిన ఇన్నోవా కారులో ఉన్న చిన్నారులు భాను (7), నీల(4) కారు లోపల ఊపిరాడక ఏడుస్తుండటాన్ని గమనించిన టాక్సీ డ్రైవర్లు వెంటనే ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు కారు అద్దాలను పగులగొట్టి చిన్నారులను సురక్షితంగా బయటకు తీశారు.

సంబంధిత పోస్ట్