చిత్రాపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీగోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఉదయం 3 గంటలకు స్వామివారిని మేల్కొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి, శ్రీకృష్ణస్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారు, సేనాధిపతి వేర్వేరు తిరుచ్చిలపై ఊరేగింపుగా తనపల్లి రోడ్డులోని పొన్నకాల్వ మండపానికి చేరుకున్నారు.