తిరుపతి: స్వచ్ఛ ఆంధ్ర సాధన లక్ష్యంగా కార్యక్రమాలు

16చూసినవారు
స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ స్థాపన లక్ష్యంగా ప్రభుత్వం ప్రతి మూడవ శనివారం “స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తెలిపారు. మంగళవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, గత 11 నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర సాధన కోసం వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమాల అమలు స్థితిని పరిశీలించి, మెరుగుదల కోసం తగిన సూచనలు ఇవ్వడానికి సమీక్ష సమావేశం నిర్వహించామని ఆయన పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you