తిరుపతి: ధ్రువపత్రాలు ఇవ్వలేదని చంటిబిడ్డతో నిరసన

11చూసినవారు
తిరుపతి: ధ్రువపత్రాలు ఇవ్వలేదని చంటిబిడ్డతో నిరసన
మంగళం- కరకంబాడి రోడ్డులోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల పూర్వవిద్యార్థిని తేజశ్రీ, తన కుటుంబ సభ్యులు, విద్యార్థి నేతలతో కలిసి బుధవారం ధ్రువపత్రాలు ఇవ్వనందుకు నిరసన వ్యక్తం చేశారు. 2011-15 బ్యాచ్ విద్యార్థిని అయిన తేజశ్రీ కోర్సు మధ్యలో వదిలేశారు. కళాశాల యాజమాన్యం ధ్రువపత్రాలు ఇవ్వడానికి నిరాకరించడంతో, ఏపీ విద్యార్థి ఐకాస జోక్యం చేసుకుని, యాజమాన్యంతో మాట్లాడి ధ్రువపత్రాలు ఇప్పించింది. అనంతరం కళాశాల యాజమాన్యం ఆమె కళాశాలకు ఎటువంటి బకాయి పడలేదని పేర్కొంది.

సంబంధిత పోస్ట్