తిరుపతి: హనుమంతవాహనంపై శ్రీగోవిందరాజస్వామి దివ్యవిహారం
By P. Parasuram 2చూసినవారుతిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం ఉదయం, శ్రీగోవిందరాజస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ ఈ వాహనసేవ అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు కర్పూర హారతులు సమర్పించి, గోవింద నామస్మరణతో స్వామివారిని దర్శించుకుని పరవశించారు.