చంద్ర గ్రహణం కారణంగా మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయం మూసివేసినట్లు టీటీడీ అదనపు ఈవో సి. హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు. క్యూలైన్ లో ఉన్న ప్రతి భక్తుడికి దర్శనం చేయించిన తర్వాత ఆలయ ద్వారాలు మూసివేసినట్లు ఆయన మీడియాతో చెప్పారు. ఆలయ మూత సమయంలో అన్న ప్రసాద కేంద్రం, లడ్డూ విక్రయ కేంద్రాలు కూడా మూసివేస్తున్నట్లు, భక్తులకు పులిహోర ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని ఆయన పేర్కొన్నారు.